News August 19, 2024

ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ సస్పెన్షన్

image

AP: ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫైబర్‌నెట్‌లో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సంస్థలో పెద్దఎత్తున తన బంధువులను నియమించి రూ.వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, మెటీరియల్ కొనుగోలు, నియామకాల్లోనూ గోల్‌మాల్ చేశారని పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు.

Similar News

News February 5, 2026

ఏపీలోని ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

AP: కాకినాడలోని <>ESIC<<>> హాస్పిటల్ 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 14వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి MBBS+ పీజీ, పీజీ డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 69ఏళ్లు. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 5, 2026

తులసి మొక్కను నాటుతున్నారా?

image

తులసి మొక్క నాటేందుకు గురు, శుక్రవారాలు శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు. ఏకాదశి తిథి, ఆది, సోమవారాలతో పాటు గ్రహణ సమయంలో నాటకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ మొక్క ఇంటికి ఉత్తరం, తూర్పు, ఈశాన్య దిశలో ఉంటే మంచి జరుగుతుందని వాస్తు నిపుణుల సూచన. దక్షిణ, నైరుతి దిశల్లో అస్సలు ఉంచకూడదంటున్నారు. అయితే తులసి మొక్కను ఎవరు నాటాలి, ఎవరు నాటకూడదో అని నియమాలున్నాయి. వాటి పూర్తి వివరాలకై క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News February 5, 2026

నటి జయవాహిని కన్నుమూత

image

సీరియల్, సినిమా నటి జయవాహిని (పద్మక్క) కన్నుమూశారు. కొంతకాలంగా రొమ్ము <<18545877>>క్యాన్సర్‌తో<<>> బాధపడుతున్న ఆమె నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచినట్లు నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. ఆమెను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశామని తెలిపారు. రఘుపతి వెంకయ్య నాయుడు, బహిర్భూమి, పోలీస్ వారి హెచ్చరిక వంటి సినిమాలతో పాటు పలు సీరియళ్లలో ఆమె నటించారు.