News August 19, 2024
శ్రీసిటీలో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఆదిమూలం

సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. శ్రీ సిటీలో ఆయన పలు కంపెనీలకు భూమి పూజ, పలు కంపెనీల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు మినహా ఇతరులకు ప్రవేశం కల్పించలేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ సిటీలో స్వాగతం పలికారు.
Similar News
News January 15, 2026
రొంపిచర్ల: కోళ్లఫారంలో యువకుడి సూసైడ్

రొంపిచర్ల: కోళ్ల ఫారంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుసూదన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన రవీంద్ర చిక్బరైక్ (29) ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగాలేదని అతని భార్య రష్మీ తెలియజేసినట్లు ఎస్సై తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News January 15, 2026
చిత్తూరు ఎస్పీకి నోటీసులు

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.
News January 15, 2026
చిత్తూరు: మీ ఫ్రెండ్స్‌ను కలిశారా..?

చిత్తూరులో ఉంటే జీతం సరిపోదు. తప్పని పరిస్థితుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ సంక్రాంతికి సొంతూరికి వచ్చేస్తుంటారు. ఈ మూడు నాలుగు రోజులు సరదాగా గడిపేస్తుంటారు. చాలా మంది తమ స్కూల్, కాలేజీ నాటి ఫ్రెండ్స్‌ను ‘గెట్ టూ గెదర్’ పేరిట కలుస్తుంటారు. మరి ఈ సారి మీ ఫ్రెండ్స్‌ను కలిశారా? లేదా కామెంట్ చేయండి.


