News August 19, 2024
హైకోర్టులో దువ్వాడ పిటిషన్

AP: తన భార్య వాణి, కుమార్తె హైందవిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ YCP MLC దువ్వాడ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై దాడి చేసి, రోజుల తరబడి టెక్కలిలోని తన ఇంటి వద్ద ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. 41A నోటీసులిచ్చినట్లు పోలీసులు వివరించగా, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Similar News
News September 13, 2025
కోహ్లీ లేడు.. పాక్‌కు ఇదే మంచి సమయం: మిస్బా

ఆసియా కప్‌లో భాగంగా రేపు మ్యాచ్ ఆడబోయే భారత జట్టులో కోహ్లీ లేకపోవడాన్ని పాకిస్థాన్ అనుకూలంగా మలుచుకోవాలని పాక్ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ అన్నారు. ‘గత పదేళ్లలో కోహ్లీ, రోహిత్ లేకుండా భారత్ T20టోర్నీలు ఆడలేదు. టాపార్డర్‌ను పాక్ బౌలర్లు దెబ్బ తీస్తే మిడిల్‌లో జట్టును ఆదుకునేందుకు విరాట్ లేరు. భారత్‌ను కూల్చేందుకు ఇదొక మంచి ఛాన్స్. శుభారంభం దక్కితే మాత్రం వారిని ఆపలేం’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి: CM

AP: రాజకీయ ముసుగులో జరిగే నేరాలను ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎస్పీలతో సమావేశమైన ఆయన.. టెక్నాలజీ సాయంతో దర్యాప్తులో అత్యుత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలన్నారు. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని ఆదేశించారు. వైఎస్ వివేకానంద హత్య, సింగయ్య మృతిని కేసు స్టడీలుగా చూడాలని సూచించారు.
News September 13, 2025
9 నెలల్లోపే ఆ స్థానాలకు ఉపఎన్నికలు: KTR

TG: తాము అధికారంలో ఉన్న సమయంలో గద్వాలను జిల్లా చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని తీసుకొచ్చామని KTR అన్నారు. ఆరు గ్యారెంటీలు అంటూ అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 22 నెలలు గడిచినా ఏమీ చేయలేదని మండిపడ్డారు. BRSలోనే ఉన్నానని చెబుతున్న గద్వాల MLA కృష్ణమోహన్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 9 నెలల్లోపే ఫిరాయింపు స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని గద్వాల సభలో అన్నారు.