News August 19, 2024
తప్పులు చేస్తూ పోలీసులపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు: SHO
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై వాహనాల పార్కింగ్ చేయించడమే కాకుండా, పోలీసులు వేధిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసిన ఢిల్లీవాలా స్వీట్ హోమ్ పై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO విజయ్ బాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం స్వీట్ హోమ్ ముందు ప్రధాన రహదారిపై అడ్డంగా ఉన్న వాహనాలను తీయించే విషయంలో పోలీసులతో యాజమాన్యం గొడవపడి వారే పోలీసులపై తప్పుడు ప్రచారం చేశారన్నారు.
Similar News
News February 5, 2025
NZB: పరీక్షా కేంద్రాలను తనిఖీ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రవి కుమార్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవన్నారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో 15 కేంద్రాలను తనిఖీ చేశారు.
News February 5, 2025
NZB: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా..!
పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించి భద్రపరిచారు. ఆర్మూర్ డివిజన్‌లో 180 పంచాయతీలుండగా బోధన్ డివిజన్ 152, నిజామాబాద్ డివిజన్‌లో 213 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు పార్టీ నేతలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
News February 5, 2025
NZB: శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి: శైలి బెల్లాల్
కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా HYDలో ఈనెల 11 నుంచి 15 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఉంటుందని NYK కో ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. ఎంపికైన 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని, శిక్షణలో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను 91004 35410 నంబర్ కు వాట్సాప్ చేయాలని ఆమె సూచించారు.