News August 19, 2024

మారేడ్ పల్లి: జూనియర్ అధ్యాపకుల వివరాల సమీకరణ

image

ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లోని అధ్యాపకుల వివరాలు సొసైటీ సమీకరిస్తోంది. ఇటీవల బదిలీల ఆనంతరం ఎంత మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు? ఖాళీల సంఖ్య ఎంత? ఎక్కడైనా పరిమితికి మంచి ఉన్నారా? వంటి గణాంకాలు వెంటనే ఇవ్వాలని సొసైటీ ప్రిన్సిపల్స్ ను ఆదేశించింది. సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ తో పాటు జనరల్, ఒకేషనల్ కళాశాలలు ఈ వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది.

Similar News

News November 12, 2025

HYD: ఫుడ్ స్టార్టప్‌లకు పోత్సాహకం: జయేష్ రంజన్

image

రాష్ట్రంలో సంప్రదాయ ఆహారానికి ప్రపంచ వేదికపై అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం దేశంలోనే తొలిసారి HYD వేదికగా ‘తెలంగాణ కలినరీ ఎక్స్‌‌‌‌పీరియన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ (TSETA) ప్రారంభించింది. ఇండో- డచ్ సహకారంతో తెలంగాణ రుచులను ఇందులో ప్రదర్శించారు. ఫుడ్​ స్టార్టప్​లకు ప్రోత్సాహకంగా ఫుడ్-టెక్, డ్రింక్స్ రంగాల్లో స్టార్టప్‌‌‌‌లను ప్రోత్సహించనున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు.

News November 12, 2025

LLM స్పాట్ అడ్మిషన్లకు గైడ్‌లైన్స్ విడుదల

image

రాష్ట్రవ్యాప్తంగా LLM కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు అధికారులు గైడ్‌లైన్స్ విడుదల చేశారు. అడ్మిషన్లు మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామన్నారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు నోటిఫికేషన్ గురువారం విడుదల చేస్తామన్నారు. కాలేజ్ లింక్ ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్లను 17వ తేదీ వరకు చేసుకోవాలని, సీట్ల కేటాయింపు జాబితాను 18న విడుదల చేస్తామని, 19వ తేదీ మ.12 గంటల వరకు కళాశాలలో రిపోర్టు చేయాలన్నారు.

News November 12, 2025

HYD: DEC 3 నుంచి టీజీ‌సెట్ హాల్ టికెట్లు

image

రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్)- 2025 పరీక్ష హాల్ టికెట్లను వచ్చే నెల 3వ తేదీ నుంచి తమ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతామని సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 29 సబ్జెక్టుల పరీక్షలను వచ్చే నెల 10వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.