News August 19, 2024
గవర్నర్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధం: సిద్దరామయ్య న్యాయవాదులు

ముడా కేసులో సీఎం సిద్దరామయ్యపై విచారణ జరపడానికి గవర్నర్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని సీఎం తరఫు న్యాయవాదులు కర్ణాటక హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఈ విషయంలో ఆయన ఎలాంటి కారణం చూపలేదన్నారు. గవర్నర్ క్యాబినెట్ నివేదికలకు కట్టుబడి ఉండాలని, సిద్దరామయ్య విషయంలో ఆయన చట్టవిరుద్ధంగా విచారణకు ఆదేశించారని వాదించారు.
Similar News
News October 29, 2025
అరటి పరిమాణం పెంచే ‘బంచ్ ఫీడింగ్’ మిశ్రమం

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.
News October 29, 2025
వైకుంఠాన్ని చేర్చే మార్గం కార్తీకమాసం

పుణ్యకాలాలన్నింటిలోకెల్లా కార్తీకమాసం అత్యుత్తమమైనది. వేదాల కంటే గొప్ప శాస్త్రం, గంగ కంటే గొప్ప తీర్థం, భార్యతో సమానమైన సుఖం, ధర్మంతో సమానమైన స్నేహం లేనట్టే.. ఈ కార్తీక మాసానికి సాటి వచ్చే పుణ్య కాలం లేదు. కార్తీక దామోదరుని (విష్ణువు) కంటే గొప్ప దైవం మరొకరు లేరు. ఈ సత్యాన్ని తెలుసుకొని, ఈ మాసంలో భక్తితో ధర్మాన్ని ఆచరించే వ్యక్తి తప్పక వైకుంఠాన్ని చేరుకుంటాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి.<<-se>>#Karthikam<<>>
News October 29, 2025
CSIR-IIIMలో 19 ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్, జమ్మూ (IIIM) 19 MTS పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in/


