News August 19, 2024

KKR వదిలేస్తే నేనెళ్లే జట్టిదే: రింకూ సింగ్

image

ఒకవేళ కోల్‌కతా నైట్‌రైడర్స్ వదిలేస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడటం ఇష్టమని యువ ఫినిషర్ రింకూసింగ్ అన్నారు. ఆ జట్టులో విరాట్ కోహ్లీ ఉండటమే ఇందుకు కారణమన్నారు. స్పోర్ట్స్ తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సూర్యకుమార్ కెప్టెన్సీ గురించి అడగ్గా అతడు ప్రశాంతంగా ఉంటాడని చెప్పారు. ఒత్తిడి లేకుండా సిక్సర్లు బాదేస్తుండటంతో రిటైరైన డీకే పాత్రకు రింకూ సరిపోతాడని RCB ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Similar News

News November 1, 2025

తీవ్ర పేదరికం నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ: సీఎం

image

తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ నిలిచినట్లు స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా CM పినరయి విజయన్ అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచినట్లు పేర్కొన్నారు. 2021లో ‘తీవ్ర పేదరిక నిర్మూలన’ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. 64వేల కుటుంబాలను గుర్తించి, ఆర్థిక లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. అటు దీన్ని ‘ప్యూర్ ఫ్రాడ్’గా పేర్కొన్న INC అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.

News November 1, 2025

మొదటి మహిళా కామెంటేటర్

image

ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్లుగా మహిళలు కనిపిస్తున్నారు. కానీ 1970ల్లో మగాళ్ల గొంతే వినిపించే క్రికెట్‌ వ్యాఖ్యానంలోకి వచ్చారు చంద్రనాయుడు. దేశపు తొలి టెస్ట్‌మ్యాచ్‌ కెప్టెన్‌ కల్నల్‌ సీకే నాయుడు కూతురామె. క్రికెట్‌ పట్ల ఆసక్తితో కొన్నాళ్లు ప్లేయర్‌గా రాణించారు. దేశపు తొలితరం మహిళా క్రికెటర్లలో ఒకరైన ఆమె BCCI, ICC ఈవెంట్లలో పాల్గొని భారత తొలిమహిళా వ్యాఖ్యాతగా రికార్డుల్లోకెక్కారు.

News November 1, 2025

మద్యం ఫీజుల రాకతో బకాయి నిధులు విడుదల

image

TG: లిక్కర్ షాపుల లైసెన్సు ఫీజుల కింద ₹2,854 కోట్లు రావడంతో ప్రభుత్వం పలు విభాగాల్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తోంది. విద్యార్థులకు ₹304 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ₹252 కోట్లు రిలీజ్ చేసింది. ఇవి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో మున్సిపాల్టీలు, పంచాయతీల రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రతి విభాగంలో కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించేందుకు ₹1కోటి చొప్పున ఇవ్వనుంది.