News August 19, 2024

అన్న క్యాంటీన్‌కు రూ.కోటి విరాళం

image

రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కో ఆర్డినేటర్ లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు రూ.కోటి విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో సోమవారం మంత్రి లోకేశ్‌కు ఈ మేరకు రూ.కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోహిత్‌ను అభినందించారు. 

Similar News

News January 30, 2026

GNT: సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్

image

గుంటూరు పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు జిల్లా యంత్రాంగం స్వాగతం పలికింది. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు చేరుకున్న సీఎంకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో కలెక్టర్ అన్సారియా పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, శాంతిభద్రతల గురించి సీఎం ఆరా తీశారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్‌కు సీఎం సూచించారు.

News January 30, 2026

కూటమి నాయకుల మధ్య సఖ్యత ముఖ్యం: మంత్రి లోకేశ్

image

టీడీపీ క్యాడర్ సమన్వయంతో పాటు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శుక్రవారం, టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టౌన్, వార్డు, మండల స్థాయి టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో మంత్రి పాల్గొన్నారు. కూటమి నాయకుల మధ్య సఖ్యత ముఖ్యమని, కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

News January 30, 2026

GNT: బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం ప్రారంభించారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో క్రాఫ్ రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు.