News August 19, 2024

అనధికార హాస్టల్ మూసివేయాలి: సీఎం చంద్రబాబు

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథశ్రమంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ముగ్గురు విద్యార్థుల మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అనధికార హాస్టల్ మూసివేయాలని ఆయన ఆదేశించారు. చిన్నారుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. అస్వస్థతకు గురైన చిన్నారుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం చెప్పారు.

Similar News

News September 22, 2025

భూములిచ్చిన రైతులను ఆదుకుంటాం: CM

image

గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నగరానికి వచ్చిన ఆయనకు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. డేటా సెంటర్ కోసం రైతులు భూములిచ్చి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్నారు. రైతుల విజ్ఞప్తిని పరిశీలించి భూ పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని CM పేర్కొన్నారు.

News September 22, 2025

విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

image

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.

News September 22, 2025

విశాఖలో పిడుగు పడి ఉద్యోగి మృతి

image

విశాఖలో సోమవారం విషాదం నెలకొంది. మధురవాడ సమీపంలో కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి జీవీఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్(37) మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.