News August 19, 2024

పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే?

image

నిందితుడు నిజాలు చెబుతున్నారా? లేదా? అనేది తెలుసుకోవడానికి <<13892681>>ఈ టెస్టు<<>> చేస్తారు. ఔషధాలు వాడకుండా అతని శరీరానికి కార్డియో-కఫ్/ఎలక్ట్రోడ్‌లను అమర్చుతారు. నిందితుడు మాట్లాడేటప్పుడు BP, శ్వాసరేటును పరిశీలిస్తారు. అబద్ధమాడితే వాటిలో మార్పులు కనిపిస్తాయి. ఈ ప్రక్రియలో అతను తెలివితో నిజాలను దాచే ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరీక్షను 19వ శతాబ్దంలో తొలిసారి ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ వినియోగించారు.

Similar News

News January 24, 2025

ట్రంప్‌నకు షాక్.. జన్మత: పౌరసత్వం రద్దు నిర్ణయం నిలిపివేత

image

USAలో జన్మత: వచ్చే <<15211801>>పౌరసత్వాన్ని<<>> రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌నకు షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు సియాటెల్ కోర్టు జడ్డి జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్డర్‌ను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టులకెక్కిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆర్డర్ ప్రకారం USAకు వలస వెళ్లిన వారికి పిల్లలు పుడితే పౌరసత్వం రాదు.

News January 24, 2025

విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912: భట్టి

image

TG: వేసవిలో పీక్ డిమాండ్‌ దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజా భవన్‌లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 108 తరహాలో విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదుకు 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ వ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

News January 24, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: జనవరి 24, శుక్రవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ✒ ఇష: రాత్రి 7.22 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.