News August 19, 2024
మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు. సచివాలయంలో జాతీయ రహదారులపై R&B శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు జాతీయ రహదారుల నిర్మాణాల స్థితిగతులపై ఆరా తీసి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. NH-65ని 6 లేన్లుగా విస్తరించేందుకు డీపీఆర్ ను తయారు చేసేందుకు కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలిచామన్నారు.
Similar News
News November 17, 2024
జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ -3 పరీక్షలు
నల్గొండ జిల్లాలో గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నల్లగొండలో 60, మిర్యాలగూడలో 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్నింగ్ పేపర్ -1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, మధ్యాహ్నం (పేపర్ 2) హిస్టరీ, పాలిటి అండ్ సొసైటీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పలు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. రేపు ఉదయం పేపర్-3 ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
News November 17, 2024
నల్లగొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. సస్పెండ్
నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేసినందు వల్ల ముగ్గురు వైద్య విద్యార్థునులు, ఒక జూనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. 2వ సంవత్సరం విద్యార్థి ఒక నెల, ఇద్దరు 4వ సంవత్సరం విద్యార్థులను ఆరు నెలలు, ఒక జూనియర్ డాక్టర్‌ను మూడు నెలలు కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు కాలేజీ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థినుల పట్ల ర్యాగింగ్ జరుగుతున్నప్పటికీ గుర్తించడంలో విఫలమైనట్లు సమాచారం.
News November 17, 2024
భువనగిరి: గ్రూప్-3 పరీక్ష.. యువతికి రోడ్డు ప్రమాదం
గ్రూప్ -3 పరీక్ష రాయడానికి వెళ్తున్న యువతికి గాయాలయ్యాయి. సంస్థాన్ నారాయణపురం చెందిన శృతి భువనగిరిలోని వెన్నెల కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్తుండగా అనాజీపురం వద్ద వారి బైక్‌పై ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో శృతికి గాయాలయ్యాయి. చికిత్స చేయించుకుని తిరిగి పరీక్ష కేంద్రానికి వెళ్లింది. కాగా సమయం ముగియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వెను తిరిగింది.