News August 19, 2024

మరో ఉపద్రవం తప్పదా?

image

కరోనా.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ చేసిన ప్రాణ నష్టం అంతా ఇంతా కాదు. మనదేశంలోనూ లక్షలాది మంది బలయ్యారు. అయితే కొవిడ్ నుంచి కోలుకున్న ప్రజలను ఇప్పుడు ఎంపాక్స్ వైరస్ భయపెడుతోంది. తొలుత ఆఫ్రికాలో బయటపడి, తర్వాత యూరప్ ఖండాల్లో వ్యాపించిన ఈ వైరస్ ఇటీవల ఆసియా ఖండంలోని మన పక్కదేశం పాకిస్థాన్‌కు చేరింది. ఇప్పటివరకు INDలో ఈ కేసులు నమోదు కాలేదు కానీ ప్రమాదమైతే పొంచి ఉంది.

Similar News

News July 8, 2025

అవి సేఫ్.. వెయ్యికి పైగా విమానాలున్నాయి: ఎయిరిండియా

image

అహ్మదాబాద్‌లో కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మోడల్ విమానం సురక్షితమైందేనని ఎయిరిండియా తెలిపింది. పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మోడల్ ఎయిర్‌‌క్రాఫ్ట్స్ వెయ్యికి పైగా సేవలందిస్తున్నాయన్నారు. అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్‌లో ఎయిరిండియా CEO విల్సన్, DGCA, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News July 8, 2025

రేపు పలు జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడగా, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం కనిపించింది. నేడు మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండిందో కామెంట్ చేయండి.

News July 8, 2025

‘కన్నప్ప’ తీయడం పూర్వజన్మ సుకృతం: మోహన్‌బాబు

image

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర నిర్మాత మోహన్‌బాబు అన్నారు. ఇవాళ అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి విజయవాడలో మూవీని ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ తీయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. మన సంస్కృతి, చరిత్రను పిల్లలకు తెలియజేయాలనే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.