News August 20, 2024
ఎంపాక్స్‌పై 6% మందిలోనే ఆందోళన

ఎంపాక్స్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించినా కూడా మన దేశంలో కేవలం 6 శాతం మంది మాత్రమే దాని గురించి ఆందోళన చెందుతున్నట్టు లోకల్‌సర్కిల్స్ సర్వేలో తేలింది. 342 జిల్లాల్లో 10 వేల మందిపై సర్వే నిర్వహించగా 13% మంది ఇంకా కొవిడ్ గురించి ఆందోళన చెందుతున్నట్లు వెల్లడైంది. ఎంపాక్స్‌పై కేంద్రం ఇప్పుడిప్పుడే చర్యలు ప్రారంభించడంతో ప్రజల్లో అవగాహన కొరవడింది.
Similar News
News July 8, 2025
‘కన్నప్ప’ తీయడం పూర్వజన్మ సుకృతం: మోహన్‌బాబు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర నిర్మాత మోహన్‌బాబు అన్నారు. ఇవాళ అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి విజయవాడలో మూవీని ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ తీయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. మన సంస్కృతి, చరిత్రను పిల్లలకు తెలియజేయాలనే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.
News July 8, 2025
15ఏళ్లు ముందుగానే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి!

అందరిలా 60 ఏళ్లకు రిటైర్ అవ్వాలని అనుకునేవారికి ప్రముఖ సీఏ కానన్ బహ్ల్ లింక్డ్ఇన్‌లో పలు సూచనలు చేశారు. పెరుగుతున్న ఖర్చులు, జీవనశైలి, ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుతం 45 ఏళ్లకే రిటైర్ అవుతారని, అందుకు తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ‘ఫ్యూచర్ గురించి ఆలోచించి పొదుపును పెంచాలి. EPF & NPSలలో ఇన్వెస్ట్ చేయండి. ఇవి మీ డబ్బును ఎక్కువ కాలం బ్లాక్ చేసి దుర్వినియోగం చేయకుండా చూస్తాయి’ అని తెలిపారు.
News July 8, 2025
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో మరో 20వేల ఎకరాల భూసమీకరణ, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.