News August 20, 2024

అక్టోబర్ 4 నుంచి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. 4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంతో ప్రారంభం కానున్నాయి.

Similar News

News March 11, 2026

చిత్తూరు: రూ.289 కోట్లతో బడ్జెట్ అంచనా

image

చిత్తూరు నగరపాలక సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.289.07 కోట్లతో బడ్జెట్ రూపొందించింది. మంగళవారం మేయర్ అముద అధ్యక్షతన జరిగిన నగరపాలక కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం లభించింది. మొత్తం జమలు రూ.296 కోట్లుగా అంచనా వేయగా, వ్యయం రూ.270.78 కోట్లుగా నిర్ణయించారు. అభివృద్ధి పనులకు రూ.25.57 కోట్లు కేటాయించారు.

News March 10, 2026

గుడిపల్లి : బైక్ నుంచి జారిపడి మహిళ మృతి

image

కుప్పం (M) కృష్ణదాసన పల్లెకు చెందిన షణ్ముగం భార్య సునీత (40) బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. సోమవారం భార్యాభర్తలు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లికి వెళుతుండగా గుడిపల్లి (M) శ్రీనివాసపురం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు సునీత బైక్ నుంచి జారి కింద పడింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. గుడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 10, 2026

గుడిపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

గుడిపల్లి (M) ఆవుల తిమ్మనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొనడంతో కోడిగాని పల్లెకు చెందిన రాధాకృష్ణ (32) మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ బైకుపై గ్రామానికి వస్తుండగా కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాధాకృష్ణ మృతి చెందాడు. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.