News August 20, 2024
శ్రీకాకుళం: జిల్లాలో రేపు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఎపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల సైతం మంగళవారం పలు చోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News January 18, 2026
రథసప్తమి వేడుకలకు పటిష్ఠ బందోబస్తు: ఐజీ

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోందని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ, డీఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, బారికేడ్లు, వాహనాల పార్కింగ్ మరియు రూట్ మ్యాప్‌లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News January 17, 2026
ఆదిత్యుని సేవలో.. శ్రీకాకుళం కలెక్టర్

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో ప్రసాద్ ఆయనకు తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.