News August 20, 2024

వక్ఫ్ సవరణ బిల్లును ముస్లింలు తిరస్కరిస్తున్నారు: షబ్బీర్ అలీ

image

TG: కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లును ముస్లింలు తిరస్కరిస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలువురు ముస్లిం వర్గ నేతలతో చర్చించిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘చర్చల్లో ముస్లిం నేతలు వక్ఫ్ సవరణను అంగీకరించలేదు. కేవలం వ్యతిరేకించడమే కాక బిల్లును తిరస్కరించాలని తీర్మానించారు. వారి అభిప్రాయాల్ని సీఎం రేవంత్‌కు తెలియజేస్తా’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 23, 2025

అభిషేక్ శర్మ బాల్ ఎక్సర్‌సైజ్ గమనించారా?

image

కోల్‌కతాలో జరిగిన తొలి T20లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఊచకోత కోశాడు. 34బంతుల్లోనే 8 సిక్సులు, 5 ఫోర్లతో 79 పరుగులు చేసి భారత్‌ను గెలిపించిన విషయం తెలిసిందే. కాగా, బ్యాటింగ్‌కు రావడానికి ముందు అభిషేక్ బంతితో చేసిన ఎక్సర్‌సైజ్ SMలో వైరల్‌గా మారింది. బంతి సీమ్‌ను వివిధ పొజిషన్లలో చూస్తూ చేసిన ఈ ప్రాక్టీస్ బ్యాటింగ్ చేసే సమయంలో ఊపయోగపడింది. మ్యాచ్‌లో ఈ బాల్ ఎక్సర్‌సైజ్ గమనించి ఉంటే COMMENT చేయండి.

News January 23, 2025

వృథా ఖర్చులు తగ్గించుకోండిలా!

image

ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అత్యవసర సమయాల్లో జీవితాలు అతలాకుతలం అవుతాయి. అందుకే వృథా ఖర్చులను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. వచ్చిన జీతం లేదా ఆదాయాన్ని 50:30:20 రూల్ ప్రకారం కేటాయించడం మంచిది. 50% డబ్బు అద్దె, ఆహారం, తదితరాలు.. 30% కోరికలు, టూర్‌లు.. 20% పొదుపు చేస్తే వృథా ఖర్చు తగ్గుతుంది. అలాగే, ఒక వస్తువును చూడగానే కొనాలని అనిపిస్తే 24 గంటల పాటు ఆగి, అప్పటికీ అవసరం అనుకుంటేనే కొనండి.

News January 23, 2025

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య

image

TG: ఏడాదిలోపే 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, త్వరగా వాటిని భర్తీ చేయాలని MP ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. BRS నోటిఫికేషన్లను పూర్తి చేసి తమవిగా కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 65ఏళ్లకు పెంచే ఆలోచనను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని హెచ్చరించారు. వయసు పెంచితే 40వేల ఉద్యోగాలకు గండి పడుతుందని చెప్పారు.