News August 20, 2024

VSKP: చిన్నారుల మృతి.. ఆయనపై హత్య కేసు

image

ఉమ్మడి విశాఖ జిల్లా కోటవురట్ల(M) కైలాసపట్నంలోని అనాథ ఆశ్రమంలో ముగ్గురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. పాయకరావుపేట(M) అరట్లకోటకు చెందిన పాస్టర్ కిరణ్ కుమార్ ఈ ఆశ్రమం నడుపుతున్నాడు. అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆయనపై హత్య కేసు నమోదు చేశారు. పైఫొటోలో కనపడుతున్న చిన్న రేకుల షెడ్డులోనే దాదాపు 97 మంది పిల్లలతో ఆశ్రమం నిర్వహిస్తుండగా.. దీనికి అనుమతులు లేవని సమాచారం.

Similar News

News September 22, 2025

భూములిచ్చిన రైతులను ఆదుకుంటాం: CM

image

గూగుల్ డేటా సెంటర్ కోసం తర్లువాడలో భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నగరానికి వచ్చిన ఆయనకు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు. డేటా సెంటర్ కోసం రైతులు భూములిచ్చి ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్నారు. రైతుల విజ్ఞప్తిని పరిశీలించి భూ పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని CM పేర్కొన్నారు.

News September 22, 2025

విశాఖలో కేంద్రమంత్రి స్వాగతం పలికిన కలెక్టర్

image

28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి (DARPG & DOPPW) జితేంద్రసింగ్ సోమవారం విశాఖపట్నం చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రిని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు.

News September 22, 2025

విశాఖలో పిడుగు పడి ఉద్యోగి మృతి

image

విశాఖలో సోమవారం విషాదం నెలకొంది. మధురవాడ సమీపంలో కొమ్మాది గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడి జీవీఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ప్రకాష్(37) మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలానికి పీఎం పాలెం పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.