News August 20, 2024
సినీ రంగంలో రాణిస్తోన్న మన సూర్యాపేట బిడ్డ

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమళ్ల గ్రామానికి చెందిన అక్కినపల్లి రాములు, పూలమ్మ కుమారుడు అక్కినపల్లి సుధాకర్ సినీ రంగంలో రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈయనది నిరుపేద కుటుంబం. జీవనోపాధి కోసం తల్లిదండ్రులతో పాటు HYD వెళ్లిన ఆయన చదువు మానేసి ఫొటోగ్రఫీలో మెలకువలు నేర్చుకున్నారు. ముందు టీవీ ఛానళ్లలో అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేసి, 2019 నుంచి సినీరంగంలో పనిచేస్తున్నారు.
Similar News
News September 14, 2025
మునుగోడు: యువతి సూసైడ్

తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన యువతి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుంది. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులకు వెళ్లాలని తల్లి మందలించగా మునుగోడు మండలం చెల్మెడకు చెందిన భవాని (25) పురుగుల మందు తాగింది. చికిత్స కోసం నల్గొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News September 14, 2025
నల్గొండ: 26,692 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. శనివారం ఒక్క రోజే 26,692 కేసులను పరిష్కరించినట్లు జిల్లా జడ్జి ఎం.నాగరాజు వెల్లడించారు. ఈ అదాలత్‌లో 71 సివిల్, 15,921 క్రిమినల్, 96 మోటార్ వాహన ప్రమాద బీమా, 50 బ్యాంక్, 73 సైబర్ క్రైమ్, 35 ట్రాన్స్‌కో, 10,446 ట్రాఫిక్ చలాన్ కేసులు రాజీ కుదిరి పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 14, 2025
NLG: తెప్ప తిరగబడి మత్స్యకారుడి మృతి

చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మత్య్సకారుడు మృతిచెందాడు. ఈ ఘటన శనివారం జరగ్గా ఆదివారం మృతదేహం లభ్యమైంది. మాడుగులపల్లి (M) గజలాపురం గ్రామానికి చెందిన సింగం యాదగిరి (37) ఈనెల 13న చేపలు పట్టేందుకు అతని కొడుకు వరుణ్ తేజ్‌తో కలిసి పానగల్ ఉదయ సముద్రం కట్ట వద్దకు వెళ్లాడు. ఒక్కసారిగా వర్షం కురిసి, బలమైన గాలికి తెప్ప ప్రమాదవశాత్తు తిరగబడి యాదగిరి చెరువులో మునిగి మృతి చెందాడు.