News August 20, 2024
ADB: ఆరేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి (30) లైంగికంగా వేధించిన ఘటన ఆదిలాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల ప్రకారం.. బాలిక తన తండ్రితో కలిసి దుకాణానికి వచ్చింది. తండ్రి కొనుగోళ్లు చేస్తూ ఉండగా అక్కడే ఉన్న బాలికను నిందితుడు లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. గమనించి తండ్రి అతడిని మందలించి వన్ టౌన్‌లో ఫిర్యాదు చెయ్యగా ఆదివారం రాత్రి నిందితునిపై పోక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News January 21, 2026
ఆదిలాబాద్: తొలిసారిగా JEE మెయిన్స్ పరీక్షలు

దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో తొలిసారిగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 21, 22, 23, 24, 28వ తేదీల్లో రెండు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని నిబంధన విధించడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు తనిఖీలు చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.
News January 20, 2026
ఆదిలాబాద్: లారీ ఢీకొని వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌లోని తిరుపల్లి వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి (50) లారీ కిందపడి దుర్మరణం చెందాడు. కాలినడకన రోడ్డు పక్క నుంచి వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వచ్చిన లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు 2 టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టామన్నారు.
News January 20, 2026
ADB: రేపు డిప్యూటీ సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నెల 21న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూర్ మండలం దంతన్ పల్లి, కుమ్మరి తండాలలో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ పర్యటించి ఏర్పాట్లు పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు.


