News August 20, 2024

అలా చేసి ఉంటే చిన్నారులు బతికే వాళ్లు..!

image

పుడ్ పాయిజన్ ఘటనలో ముగ్గురు చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. శనివారం రాత్రే ఆశ్రమంలోని పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆదివారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఇంటికి పంపేయగా అక్కడ చనిపోయారు. ఆశ్రమానికి దగ్గరలో 50 పడకల ఆసుపత్రి ఉంది. వారిని శనివారం రాత్రే అక్కడికి తీసుకెళ్లి ఉంటే బతికే వాళ్లని, సకాలంలో వైద్యం అందకపోవడంతోనే చనిపోయారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Similar News

News September 15, 2025

విశాఖలో పర్యటించనున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 17న విశాఖలో పర్యటించనున్నారు. 16న రాత్రి ఆమె విశాఖ చేరుకుని ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తారు. 17న ఉదయం 10 గంటలకు ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో జిఎస్టి సంస్కరణలపై ఔట్ రీచ్ ప్రోగ్రాంలో పాల్గొంటారు. 12 గంటలకు స్వస్థ నారీ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగిస్తారు.‌ 3 గంటలకు జీసీసీ బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

News September 15, 2025

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 111 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 111 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 02, రెవెన్యూ 11, ప్రజారోగ్యం 13, పట్టణ ప్రణాళిక 51, ఇంజినీరింగు 28, మొక్కల విభాగమునకు 03, యుజీడీ విభాగమునకు 03 కలిపి మొత్తంగా 111 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News September 15, 2025

విశాఖలో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు

image

గత నెల ఒకటి రెండు తేదీల్లో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 81 హోటల్స్‌లో శాంపిల్స్ సేకరించి ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. వీటి ఫలితాలు రావడంతో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని మరో 14 హోటల్స్‌పై జేసి కోర్టులో జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. హోటల్స్ యజమానులు ఫుడ్ సేఫ్టీ ప్రకారం నాణ్యత పాటించాలన్నారు.