News August 20, 2024

కడప: సులభంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు

image

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా సులభంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని APSPDCL ఎస్ఈ రమణ తెలిపారు. ఒక కిలో వాట్ సోలార్ రూఫ్ టాప్‌కు రూ.70 వేలు, 2 కిలోవాట్లకు రూ.1.40 లక్షలు, 3 కిలోవాట్లకు రూ.2.10 లక్షలు ఖర్చవుతుందని, PMSGY పథకం ద్వారా 1 కిలోవాట్‌కు రూ.30,000, 2 కిలోవాట్లకు రూ.60,000, 3 కిలోవాట్లకు రూ.78000 చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు.

Similar News

News September 30, 2024

కడప జిల్లాలో పేలిన డిటోనేటర్.. కారణం?

image

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వి కొత్తపల్లి గ్రామంలో <<14229836>>డిటోనేటర్ పేలి VRA మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మైనింగ్ కోసం ఉంచిన డిటోనేటర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News September 30, 2024

కడప జిల్లాలో బాంబు పేలుడు.. VRA మృతి

image

కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక VRA వి నరసింహులు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేయడంతో VRA మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

News September 30, 2024

కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

image

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-24437 ల్యాండ్ లైన్ నంబర్‌కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.