News August 20, 2024

టమాటా రేటు డౌన్.. పారబోసి రైతుల నిరసన

image

AP: బహిరంగ మార్కెట్‌లో టమాటా KG ₹20-25 వరకు ఉన్నా రైతులకు నిరాశే ఎదురవుతోంది. అనంతపురంలోని కక్కలపల్లి మండీలో నాణ్యత పేరుతో వ్యాపారులు చాలా వరకు పంటను కొనడం లేదు. 15 KGల బాక్సుకు రూ.100-200 మధ్యే రేటు కేటాయిస్తున్నారు. దీంతో రైతులు పంటను రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి చిత్తూరు తర్వాత అనంతపురంలో అత్యధికంగా 55 వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు.

Similar News

News January 16, 2026

12,000 మంది మృతి.. ఎక్కడికక్కడ శవాల గుట్టలు!

image

ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో 12 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. మెషీన్ గన్లతో పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. వందల మృతదేహాలు ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లాలని లేదంటే సామూహిక సమాధి చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచి కాల్పులు ఆగినట్లు US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.

News January 16, 2026

రేపు కాకినాడ.. ఎల్లుండి అమరావతిలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు కాకినాడలో పర్యటించి అమ్మోనియం ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఎల్లుండి ఆయన అమరావతిలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. ఈ నెల 19న సీఎం దావోస్ పర్యటనకు వెళ్తారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా ఈ టూర్ ఉండనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రస్తుతం సీఎం స్వగ్రామం నారావారిపల్లెలో ఉన్న విషయం తెలిసిందే.

News January 16, 2026

మరియా గొప్ప మహిళ: ట్రంప్

image

వెనిజులా ప్రతిపక్ష నేత మరియా మచాడో తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు అందజేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. మరియాతో భేటీ కావడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. చాలా కష్టాలను ఎదుర్కొన్న ఆమె గొప్ప మహిళ అని కొనియాడారు. తాను చేసిన కృషిని గౌరవిస్తూ నోబెల్ శాంతి బహుమతి అందజేసినట్లు పేర్కొన్నారు. పరస్పర గౌరవానికి ఇదో గొప్ప సూచిక అని చెప్పారు. ఈ సంద్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.