News August 20, 2024
సెబీ చీఫ్ మాధబిపై ఎంక్వైరీ!
సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురిపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర ఆర్థిక శాఖ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. సెబీ ప్రతినిధులు కూడా ఈ దర్యాప్తు సంఘంలో ఉంటారని సమాచారం. అయితే, సెబీ చీఫ్‌గా మాధబి కొనసాగుతున్న నేపథ్యంలో, ఆమె నియంత్రణలోని సంస్థ ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యం అయితే కమిటీ విచారణపై అనుమానాలు పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News January 23, 2025
హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్
TG: మార్చి 18 నుంచి హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్‌జెట్ సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు(మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్‌లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.
News January 23, 2025
పౌర విమానయానంలో 15% వృద్ధి: రామ్మోహన్
PM మోదీ నేతృత్వంలో భారత్ ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అత్యుత్తమ విధానాలే బలమైన దేశంగా మారడానికి కారణమని చెప్పారు. ‘ప్రపంచ దేశాలన్నీ అవకాశాల కోసం భారత్ వైపు చూస్తున్నాయి. పౌర విమానయాన రంగాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. ఏఐ, డీప్ టెక్ లాంటి సాంకేతికత ద్వారా సేవలు మరింత విస్తృత పరుస్తాం. పౌరవిమానయాన రంగం ప్రస్తుతం 15% వృద్ధి చెందుతోంది’ అని దావోస్‌లో రామ్మోహన్ తెలిపారు.
News January 23, 2025
తెలంగాణలో JSW రూ.800 కోట్ల పెట్టుబడులు
TGలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు JSW సంస్థ దావోస్‌లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. USకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.