News August 20, 2024

కుండపోత వర్షాలు.. ఉద్యోగులకు సెలవులు రద్దు

image

TG: హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో GHMC జలమండలి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జీఎం, డీజీఎం, మేనేజర్లతో ఎండీ అశోక్‌రెడ్డి అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బందికి అన్ని రకాల సెలవులూ రద్దు చేశారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలకు ట్యాంకర్లతో సురక్షిత జలాలను సరఫరా చేయాలని ఆదేశించారు. మ్యాన్‌హోళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు సూచించారు.

Similar News

News January 23, 2025

హైదరాబాద్ నుంచి వియత్నాంకు విమాన సర్వీస్

image

TG: మార్చి 18 నుంచి హైదరాబాద్, వియత్నాం మధ్య విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. వియట్‌జెట్ సంస్థ నడిపే ఈ విమాన సర్వీసులు వారంలో రెండు రోజులు(మంగళ, శనివారం) మాత్రమే అందుబాటులో ఉంటాయి. హోచిమన్ సిటీ(వియత్నాం) నుంచి రాత్రి 7.40కు బయల్దేరే ఫ్లైట్ రాత్రి 10.35కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుతుంది. రాత్రి 11.35కు శంషాబాద్‌లో బయల్దేరి, తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు వియత్నాం చేరుతుంది.

News January 23, 2025

పౌర విమానయానంలో 15% వృద్ధి: రామ్మోహన్

image

PM మోదీ నేతృత్వంలో భారత్ ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అత్యుత్తమ విధానాలే బలమైన దేశంగా మారడానికి కారణమని చెప్పారు. ‘ప్రపంచ దేశాలన్నీ అవకాశాల కోసం భారత్ వైపు చూస్తున్నాయి. పౌర విమానయాన రంగాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం. ఏఐ, డీప్ టెక్ లాంటి సాంకేతికత ద్వారా సేవలు మరింత విస్తృత పరుస్తాం. పౌరవిమానయాన రంగం ప్రస్తుతం 15% వృద్ధి చెందుతోంది’ అని దావోస్‌లో రామ్మోహన్ తెలిపారు.

News January 23, 2025

తెలంగాణలో JSW రూ.800 కోట్ల పెట్టుబడులు

image

TGలో రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు JSW సంస్థ దావోస్‌లో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. USకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్ ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభిస్తాయి. రక్షణ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.