News August 20, 2024
కొత్తగూడెం: ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయమూర్తి ప్రసవం

కొత్తగూడెంకు చెందిన న్యాయమూర్తి స్వప్న ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. సన్యాసిబస్తీ న్యాయవాది కార్తీక్, స్వప్న దంపతులు. ఆరేళ్లుగా నిడమనూరు జూ.సివిల్ జడ్జిగా ఆమె పనిచేస్తున్నారు. మొదటి కాన్పు కోసం పుట్టింటికి రాగా, రామవరంలోని ప్రభుత్వ మాతా, శిశు ఆరోగ్యకేంద్రంలో ఆడశిశువుకు జన్మనిచ్చారు. సామాన్య ప్రజలకు నమ్మకం వచ్చేలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన స్వప్నను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.
Similar News
News March 13, 2025
ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సంగ్ చౌహాన్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద పసుపు పంట కొనుగోలు చేయాలని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్చిలో అధిక మొత్తంలో పసుపు పంట మార్కెట్‌కు వచ్చే అవకాశముందని, రైతులు నష్టపోకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
News March 13, 2025
‘ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు’

∆} సత్తుపల్లి: ‘మద్యం మత్తులో ఢీ.. ఇద్దరికి గాయాలు’ ∆} ఖమ్మం: కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ ∆} సత్తుపల్లి: పురుగు మందుతో రైలు పట్టాలపై ఆందోళన ∆} వైరాలో ప్రమాదం.. ఒకరు మృతి ∆} ఖమ్మం: ఐదుగురికి షోకాజ్ నోటీసులు ∆}ఖమ్మం: ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనం ∆}ఖమ్మం: ఎలక్ట్రికల్ షాప్‌లో అగ్ని ప్రమాదం భారీగా ఆస్తి నష్టం ∆} ఖమ్మం: ‘ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయాలి’.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఖమ్మం జిల్లాకి ఏం కావాలంటే..?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.ఖమ్మం మున్నేరు పై తీగల వంతెన నిర్మాణం, పాలేరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిధులు, సీతారామ ప్రాజెక్ట్, రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలంటున్నారు.