News August 20, 2024
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.66,600కు చేరింది. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.120 తగ్గి రూ.72,650 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.1000 పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రూ.92వేలుగా ఉంది.
Similar News
News January 15, 2025
ప్రేమించిందని పోలీసుల ముందే కూతురిని చంపిన తండ్రి
MPకి చెందిన మహేశ్ గుర్జార్ తన కూతురు తనూ(20)కు మరో 4 రోజుల్లో పెళ్లి జరిపించాలని నిర్ణయించాడు. ఇంతలో తాను విక్కీ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబీకులు ఒప్పుకోవడంలేదంటూ తనూ SMలో ఓ వీడియో పెట్టింది. విషయం పోలీసులకు, గ్రామస్థులకు తెలియడంతో నచ్చజెప్పేందుకు పంచాయితీ పెట్టారు. ఈక్రమంలోనే తండ్రీకూతురు మధ్య వాగ్వాదం జరగడంతో అందరి ముందే తనూను మహేశ్ కాల్చి చంపాడు.
News January 15, 2025
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు-2025
*మే 12న ఈసెట్
*జూన్ 1న ఎడ్‌సెట్
*జూన్ 6న లాసెట్, పీజీ లా సెట్
*జూన్ 8, 9 తేదీల్లో ఐసెట్
*జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్
News January 15, 2025
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అలర్ట్.. EAPCET తేదీలు వచ్చేశాయ్
TG: ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే EAPCETను ఏప్రిల్ 29 నుంచి నిర్వహిస్తామని తెలిపింది. APR 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.