News August 20, 2024
కిక్కిరిసిపోతున్న జైళ్లు!

రాష్ట్రంలోని జైళ్లు ఖైదీలతో నిండిపోయాయి. మాదకద్రవ్యాలకు సంబంధించిన అరెస్టులతో సామర్థ్యం కంటే రెట్టింపు ఖైదీలను జైళ్లలో ఉంచాల్సి వస్తోంది. చంచల్‌గూడ సెంట్రల్ జైలులో 1,250 మందిని ఉంచాల్సి ఉండగా ప్రస్తుతం 2,103 మంది ఖైదీలు ఉన్నారు. సంగారెడ్డి జైలులో 220 మందికి బదులు 569 మంది ఖైదీలున్నారు. వరంగల్ సెంట్రల్ జైలును కూల్చేయడంతో అందులోని వెయ్యి మంది ఖైదీలను ఇతర జైళ్లకు తరలించడంతో వాటిలో రద్దీ పెరిగింది.
Similar News
News January 22, 2026
AI ప్రయోజనాలు అందరికీ అందాలి: చంద్రబాబు

ప్రభుత్వ సేవలను మెరుగు పరిచేందుకు AIని వినియోగిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. దావోస్‌లో AIపై నిర్వహించిన సెషన్‌లో ప్రసంగించారు. ‘AI కేవలం టెక్ కంపెనీలు, సిటీలకే పరిమితం కాకుడదు. ప్రతి పౌరుడు, రైతులు, విద్యార్థులు, ఎంటర్‌పెన్యూర్స్ అందరికీ దాని బెనిఫిట్స్ దక్కాలి’ అని తెలిపారు. మరో సెషన్‌లో రాష్ట్రంలో న్యాచురల్ ఫార్మింగ్ కోసం 20లక్షల ఎకరాలు, 18లక్షల మంది రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
News January 22, 2026
ట్రంప్‌కు EU కౌంటర్.. ట్రేడ్ డీల్ ఫ్రీజ్

గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవాలన్న US అధ్యక్షుడు ట్రంప్ మొండి వైఖరికి EU కౌంటరిచ్చింది. యూరప్ దేశాలపై ఆయన సంధించిన టారిఫ్స్ అస్త్రాన్ని తిప్పికొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. USతో ట్రేడ్ డీల్‌కు ఆమోదం తెలపకుండా EU పార్లమెంట్ ఫ్రీజ్ చేసింది. డీల్‌లో భాగంగా రానున్న రోజుల్లో అమెరికా వస్తువులపై టారిఫ్స్ ఎత్తేసేందుకు ఓటింగ్ జరపాల్సి ఉంది. కానీ ట్రేడ్ డీల్ నిలిపివేయడంతో ఓటింగ్ జరిగే పరిస్థితి లేదు.
News January 22, 2026
జనవరి 22: చరిత్రలో ఈ రోజు

1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1885: ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
2014: సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణం (ఫొటోలో)


