News August 20, 2024
37 మంది అరెస్టు.. 50 FIRలు నమోదు
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో ఇప్పటి వరకు 37 మందిని అరెస్టు చేసి, 50 FIRలు నమోదు చేసినట్టు బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ ఘటనలో బాధితురాలిది అత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వివరించారు. సీబీఐ దర్యాప్తు పురోగతిపై గురువారం నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Similar News
News January 24, 2025
విలపించిన సంజూ.. కాపాడిన ద్రవిడ్
రాహుల్ ద్రవిడ్ వల్లే సంజూశాంసన్ ఇప్పుడీ స్థాయిలో ఉన్నాడని అతడి తండ్రి విశ్వనాథ్ అన్నారు. KCA అతడి కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనే కాపాడారని వెల్లడించారు. ‘ఓసారి నా కొడుకుపై KCA యాక్షన్ తీసుకుంది. అతడి కిట్, సామగ్రి లాక్కుంది. ఆ టైమ్‌లో ద్రవిడ్ కాల్ చేయగానే సంజూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. బాధపడొద్దని చెప్పిన ద్రవిడ్ అతడిని NCAకు తీసుకెళ్లి శిక్షణనిచ్చారు’ అని వివరించారు.
News January 24, 2025
నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు: హీరోయిన్
AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో <<15056007>>వివాదం<<>> వేళ హీరోయిన్ మాధవీలత సంచలన ఆరోపణలు చేశారు. ‘నిన్న నేను కారులో వెళ్తుంటే మరో కారు తాకుతూ వెళ్లింది. నా వాహనానికి బాగా స్క్రాచెస్ పడ్డాయి. అయినా వాళ్లు ఆపలేదు. ‘‘పెద్దవాళ్లు’’ నాకు ఏదో చేస్తున్నారు అనిపిస్తోంది’ అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. కాగా తనను చంపాలంటే చంపొచ్చని ఇటీవల మాధవీలత వ్యాఖ్యానించారు.
News January 24, 2025
ఫీజులోనూ ఈ వ్యత్యాసం ఎందుకు?.. విద్యార్థి ఆవేదన
పోటీ పరీక్షల్లో రిజర్వేషన్లను దాటుకొని సీటు సాధిస్తే.. ఫీజులోనూ వ్యత్యాసం చూపడం ఏంటని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ MBBS ఫీజు GENకి రూ.14లక్షలు, OBCకి రూ.8లక్షలు, SC/STకి 0, EWS విద్యార్థులకు రూ.7లక్షలు అని ఉంది. తమ తల్లిదండ్రులూ అప్పులు చేసి చదివిస్తున్నారంటూ కొందరు వాపోతున్నారు. ఇక్కడైనా రిజర్వేషన్ తీసేయాలని సూచిస్తున్నారు.