News August 20, 2024
RR: 5,924 రోజులుగా నిరీక్షణ!

IPL ట్రోఫీని గెలిచేందుకు అన్ని టీమ్స్ శాయశక్తులా కష్టపడతాయి. కానీ, చివరికి ఒక్క జట్టుకే ట్రోఫీ దక్కుతుంది. అయితే ఓసారి కప్ గెలిచిన టీమ్ మరోసారి దాన్ని నెగ్గడం అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. 2008లో తొలిసారి IPL ట్రోఫీ నెగ్గిన RR మరోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు 5,924 రోజులుగా ఎదురుచూస్తోంది. అటు SRH 2016లో గెలవగా 3005 రోజులుగా మరో ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. MI కూడా కప్ గెలిచి 1379 రోజులైంది.
Similar News
News November 7, 2025
రాజోలు: అండర్ 14 క్రికెట్ జట్టుకు రితీశ్ రాజ్ ఎంపిక

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఎంపిక కార్యక్రమంలో మలికిపురానికి చెందిన బత్తుల రితీశ్ రాజ్ అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారుడు. ఈ సందర్భంగా దళిత చైతన్య వేదిక నాయకులు రితీశ్ రాజ్‌ను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పాలమూరి శ్యాంబాబు, బత్తుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
SBI అరుదైన ఘనత

మార్కెట్ విలువలో 100 బిలియన్ డాలర్ల(రూ.8.8 లక్షల కోట్లు) కంపెనీగా SBI నిలిచింది. ఈ ఘనత సాధించిన ఆరో భారత కంపెనీగా, తొలి ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డు సృష్టించింది. నిన్న SBI షేరు జీవితకాల గరిష్ఠం రూ.971.15కు చేరడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈ జాబితాలో ఇప్పటి వరకు రిలయన్స్, HDFC బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, ICICI బ్యాంక్ ఉన్నాయి.
News November 7, 2025
చీమలంటే భయం.. అసలేంటీ మైర్మెకోఫోబియా?

మైర్మెకోఫోబియా గ్రీకు పదాలు మైర్మెక్స్(చీమ)+ ఫోబోస్(భయం) నుంచి వచ్చింది. ఈ ఫోబియా గలవారు చీమలతో ప్రమాదం, నష్టమని ఆందోళన చెందుతారు. వారికి చీమలంటే అసహ్యం, భయం. ఈ భయం పెరిగితే చీమలను చూస్తే పానిక్ అటాక్ రావొచ్చు. దీనికి కాగ్నిటివ్-బిహేవియరల్ థెరపీ, హిప్నోథెరపీ, ఎక్స్‌పోజర్ థెరపీల చికిత్సతో తగ్గించవచ్చు. ఈ భయంతో సంగారెడ్డి (TG) జిల్లా అమీన్‌పూర్‌లో మనీషా నిన్న ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే.


