News August 20, 2024
హరియాణా ఎన్నికల్లో వినేశ్ పోటీ?

ఒలింపిక్స్ ఫైనల్‌కు ముందు అధిక బరువుతో అనర్హత వేటుపడ్డ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రాజకీయాల్లోకి వస్తారని వినికిడి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్పారని IANS తెలిపింది. ఆమెతో పాటు భజరంగ్ పునియా సైతం రాజకీయ రణరంగంలోకి రావొచ్చని వెల్లడించింది. బబితా ఫొగట్ (బీజేపీ)పై వినేశ్, యోగేశ్వర్ దత్ (బీజేపీ)పై భజరంగ్ పోటీని కొట్టిపారేయలేమని పేర్కొంది.
Similar News
News February 7, 2026
వీటిపై USలో జీరో టారిఫ్స్

ట్రేడ్ డీల్‌తో అమెరికాలో భారత వస్తువులపై 18% సుంకాలు వర్తించనున్నాయి. అయితే కొన్నింటిపై 0% డ్యూటీ కూడా ఉన్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. అవి.. జెమ్స్, డైమండ్స్, ఫార్మా, విమాన పరికరాలు, స్మార్ట్‌ఫోన్లు, స్పైసెస్, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, వక్కలు, బ్రెజిల్ నట్స్, జీడిపప్పు, చెస్ట్ నట్స్, వెజిటెబుల్ వ్యాక్స్, అవకాడో, అరటి, మామిడి, పైనాపిల్, పుట్ట గొడుగులు, బేకరీ ప్రొడక్ట్స్.
News February 7, 2026
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

నేపాల్ యాక్టర్ సునీల్ థాపా(68) కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కాఠ్‌మాండూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 40 ఏళ్ల కెరీర్‌లో 300కి పైగా నేపాలీ, బాలీవుడ్, భోజ్‌పురి సినిమాల్లో నటించారు. హిందీలో ‘మేరీ కోమ్’, తెలుగులో ‘మిరాయ్’ మూవీలోనూ కనిపించారు. ఆయన మృతిపై సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 7, 2026
దేశంలో ముస్లిం జనాభా హిందువులను దాటదు: అసదుద్దీన్

దేశంలో హిందూ జనాభాను ముస్లింలు ఎప్పటికీ అధిగమించలేరని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ముస్లిం జనాభా స్టెబిలైజ్ అవుతుందన్నారు. ‘20 ఏళ్ల తర్వాత వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై ఆలోచించకుండా ముస్లిం జనాభా ఎక్కువవుతోందని గతంలో కొందరు అన్నారు. వృద్ధుల సంఖ్య పెరిగితే దేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. పిల్లల్ని కనాలని చెబుతున్నారు’ అని విమర్శించారు.


