News August 20, 2024

పోలవరం ఫైల్స్ దహనం వెనుక హస్తం ఎవరిదో..?

image

ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ కార్యాలయంలో ఫైల్స్ కాల్చివేత ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. దాని వెనుక ఎవరున్నారు..? కీలక విభాగాల్లో పత్రాలన్నీ ఉన్నాయా..? ఏవైనా మాయమయ్యాయా..? అనే దానిపై ఫోకస్ చేశారు. కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాలతో సోమవారం ఉదయం నుంచే కార్యాలయంలో ఫైల్స్ పరిశీలన చేపట్టారు. ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా బందోబస్త్ ఏర్పాటు చేశారు. కాలిన కాగితాల్లో ఏముందో తేలాల్సి ఉంది.

Similar News

News August 23, 2025

రాజమండ్రి: కొత్త బార్ పాలసీలో కల్లు గీత కార్మికులకు ప్రాధాన్యం

image

మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త బార్ పాలసీని అమల్లోకి తెచ్చిందని ఎక్సైజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు. ఈ పాలసీలో భాగంగా బార్లలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం రాజమండ్రిలో ఉమ్మడి తూ.గో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, స్టేషన్ సీఐలతో ఆయన సమావేశం నిర్వహించారు.

News August 23, 2025

యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

రైతులు అవసరానికి మించి యూరియాను వాడకుండా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పి.ప్రశాంతి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం రాజమండ్రి కలెక్టరేట్‌లో యూరియా వినియోగంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 18,588 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేశామని వెల్లడించారు. ఇంకా 2,405 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News August 23, 2025

రాజమండ్రి: దోమల నియంత్రణకు డ్రోన్ టెక్నాలజీ

image

రాజమండ్రిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ శుద్ధి లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ పి.ప్రశాంతి ప్రారంభించారు. ఇందులో భాగంగా కంబాల చెరువు పార్కులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. డ్రోన్లతో మందులు పిచికారీ చేయడంతోపాటు, దోమల లార్వాలను తినే గాంబూసియా చేపలను చెరువులో వదిలారు. ఈ వినూత్న కార్యక్రమం పట్ల ఎమ్మెల్సీ హర్షం వ్యక్తం చేశారు.