News August 20, 2024

టీడీఆర్ బాండ్ల జారీపై మంత్రి సమీక్ష

image

టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్ విభాగంతో రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలన్నారు.

Similar News

News November 7, 2025

GNT: రెండవ శనివారం సెలవుపై సడలింపు..రేపు స్కూల్స్‌కి హాలిడే

image

తుఫానుకు 4 రోజులు ఇచ్చిన సెలవులను భర్తీ చేస్తూ 2వ శనివారం కూడా స్కూల్స్ పనిచేస్తాయని చేసిన ప్రకటనను సడలించారు. గత నెల 23న అన్ని పాఠశాలలు తమ స్థానిక సెలవులలో ఒకదాన్ని వినియోగించుకోవడం వల్ల 8వ తేదీ 2వ శనివారం పని చేయవలసిన అవసరం లేదని తమకు సమాచారం వచ్చినట్లు తెనాలి ఎంఈఓ జయంత్ బాబు తెలిపారు. మిగిలిన 3 సెలవులను ప్రొసీడింగ్స్‌లో జారీ చేసిన విధంగా వచ్చే 3 నెలల్లో 2వ శనివారాలతో భర్తీ చేసుకోవచ్చన్నారు.

News November 7, 2025

దుగ్గిరాలలో యువకుడి దారుణ హత్య

image

దుగ్గిరాలలోని వంతెన డౌన్‌లో రజకపాలెంకు చెందిన వీరయ్య (37) దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

News November 7, 2025

GNT: సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన కలెక్టర్

image

సీఎం చంద్రబాబును గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడికొండ మండలం లాం గ్రామంలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో శుక్రవారం జరిగిన ఎన్జీ రంగా 125వ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ తమీమ్ అన్సారియా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించి స్వాగతం పలికారు.