News August 20, 2024
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి
బతికి ఉన్న వారిలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరున్న మరియా బ్రన్యాస్ మోరేరా మృతి చెందారు. అమెరికాలో జన్మించిన మరియా 117 సంవత్సరాల 168 రోజులు బతికారు. ఆమె మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈమె మరణంతో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా జపాన్‌కు చెందిన టొమికా ఇటూకా(116ఏళ్లు) నిలిచారు.
Similar News
News January 24, 2025
ట్రెండింగులో #AttackOnBSF
రెండు వారాల క్రితం సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న BSF జవాన్లపై బంగ్లాదేశీ పశువుల స్మగ్లర్లు అటాక్ చేశారు. జీవాలను తీసుకెళ్తుండగా ప్రశ్నించడంతో పదునైన వస్తువులతో వారి గొంతు, మెడ, ఛాతీ, తొడలపై దాడి చేశారు. కుటదా బోర్డర్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో మన జవాన్లపై ఇంకెంత కాలం ఇలాంటి దారుణాలని ప్రశ్నిస్తూ నెటిజన్లు #AttackOnBSFను ట్రెండ్ చేస్తున్నారు.
News January 24, 2025
CID చేతికి కిడ్నీ రాకెట్ వ్యవహారం?
HYD సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసును ప్రభుత్వం CIDకి బదిలీ చేసే అవకాశముంది. ఇప్పటికే వైద్యశాఖ సమావేశంలో అధికారులు దీనిపై చర్చించారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 6 నెలలుగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు తేల్చారు. ఒక్కో ఆపరేషన్‌కు ₹50లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ ఉన్నట్లు సమాచారం.
News January 24, 2025
కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడనున్నారు. ఈ నెల 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగుతారు. ఈ క్రమంలో ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే అరుణ్ జైట్లీ స్టేడియంలోకి ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. కాగా విరాట్ చివరిసారి 2012లో రంజీ మ్యాచ్‌లో ఆడారు.