News August 20, 2024

తిరుపతి జిల్లా హోంగార్డుల సంక్షేమానికి పెద్దపీట

image

తిరుపతి జిల్లా పోలీసు శాఖ హోంగార్డుల సంక్షేమం కోసం పాటుపడుతుందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 7 మంది హోంగార్డులకు చెక్కులు అందజేశారు. ఇటీవల అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చుల నిమిత్తం వారు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి నిమిత్తం ఒక్కొక్కరికి రూ.4,999ల చొప్పున వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉన్నారు.

Similar News

News February 1, 2026

కేంద్ర బడ్జెట్.. నెల్లూరు జిల్లా మీదుగా హైస్పీడ్ కారిడార్

image

కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా మీదుగా హైస్పీడ్ కారిడార్‌ను ప్రకటించింది. హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య ఉన్న ఈ కారిడార్‌ జిల్లాలోని అల్లూరు, నెల్లూరు, మనుబోలు, గూడూరుతోపాటు తిరుపతి(D) సూళ్లూరుపేట, తడ మీదుగా వెళ్లనుంది. ఇందు కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. మరోవైపు పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులను వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

News February 1, 2026

నెల్లూరు: నేటి నుంచే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ​జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు దాదాపు 20,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

News February 1, 2026

స్వచ్ఛరథం ఆపరేటర్ల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రామీణ ప్రాంతాల్లో తడి, పొడి చెత్తను స్వచ్ఛ రథం ద్వారా సేకరించనున్నారని వీటి ఆపరేటర్ల ఎంపికకు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని డీపీఓ వసుమతి తెలిపారు. అల్లూరు, అనంత సాగరం, ఏఎస్పేట, కొడవలూరు, బుచ్చి, నెల్లూరు రూరల్, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వెంకటగిరి, వాకాడు, ఓజిలి, విడవలూరు, సీతారామపురం, కలువాయి, దగదర్తి, దుత్తలూరు పలు మండలాల్లో స్వచ్ఛ రథం కార్యక్రమం అమలు చేయనున్నామన్నారు.