News August 20, 2024
HYD: గణేశ్ మండపాలకు పర్మిషన్ తప్పనిసరి!
రానున్న వినాయకచవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మహంకాళి ఏసీపీ సర్దార్ సింగ్ అన్నారు. గణేశ్ మండప నిర్వాహకులతో మంగళవారం హర్యానాభవన్‌లో ఆయన సమావేశం నిర్వహించారు. తప్పనిసరిగా పోలీసు నిబంధనలు పాటించాలన్నారు. అందుకు వినాయక మండప నిర్వాహకులు తమకు సహకరించాలన్నారు. సీసీ కెమెరాలు మండపంలో ఏర్పాటు చేసుకోవాలని, పోలీసుల అనుమతితోనే మండపాలు పెట్టుకోవాలన్నారు. సీఐ, ఎస్ఐలు పాల్గొన్నారు. SHARE IT
Similar News
News January 21, 2025
ECILలో జాబ్స్.. నెలకు రూ. 2,80,000
కాంట్రాక్ట్ బేసిక్ కింద ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్ 4, సీనియర్ మేనేజర్ 6 పోస్టులను ECIL భర్తీ చేస్తోంది. MBA, PG, PG డిప్లొమా ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్నవారు అర్హులు. ఫైనాన్స్, HR, డిఫెన్స్ సిస్టమ్ తదితర విభాగాల్లో GM పోస్టులకు నెలకు రూ. 1.20 లక్షల నుంచి 2.80 లక్షల Pay Scale ఉంటుంది. సీనియర్ మేనేజర్‌కు Pay Scale రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షలు చెల్లిస్తారు. అప్లై చేసేందుకు జనవరి 31 చివరి తేదీ.
SHARE IT
News January 21, 2025
రంగారెడ్డి: ప్రజావాణికి 87 ఫిర్యాదులు
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News January 20, 2025
HYD: AIR PORT రన్ వే కింద నుంచి ఎలివేటెడ్ కారిడార్!
ఎయిర్‌పోర్ట్ అథారిటీ పరిమితుల కారణంగా HMDA డబుల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని బేగంపేట అంతర్జాతీయ విమానాశ్రయ రన్ వే కింద నుంచి అండర్ గ్రౌండ్‌లో తాడ్ బండ్, బోయిన్‌పల్లి మధ్యలో దాదాపు 600 మీటర్ల మేర నిర్మించాలని నిర్ణయం తీసుకుందని హైదరాబాద్ మెట్రో ఎండీ NVS రెడ్డి తెలియజేశారు. కంటోన్మెంట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి, మార్గాలను పరిశీలించారు.