News August 20, 2024

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ కాలిపోతారా?

image

అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉందని US మిలిటరీ స్పేస్ సిస్టమ్ మాజీ కమాండర్ రుడీ రిడాల్ఫీ అంటున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్ సురక్షితంగా భూమ్మీదకు రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరైన కోణంలో క్యాప్సూల్‌కు అతుక్కోవాలన్నారు. ఒకవేళ మాడ్యూల్ కోణం మరీ ఏటవాలుగా ఉండి ఒరిపిడి పెరిగి మంటలు చెలరేగితే ఆస్ట్రోనాట్స్ మాడిమసవుతారని హెచ్చరించారు.

Similar News

News July 9, 2025

బాబు గాడిదలు కాస్తున్నారా?: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ‘కేజీ మామిడి రెండు రూపాయలా? ఇదేం దారుణం. మా ప్రభుత్వ హయాంలో రూ.22-29కి కొన్నాం. కర్ణాటకలో రూ.16 ఇచ్చి కేంద్రమే కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో బాబు గాడిదలు కాస్తున్నారా? మామిడికి కనీసం రూ.12 కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు’ అని బంగారుపాళ్యం పర్యటనలో ఫైరయ్యారు.

News July 9, 2025

యూట్యూబ్ కొత్త రూల్స్.. ఎప్పటినుంచంటే?

image

యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాన్ని ఈనెల 15వ తేదీ నుంచి కఠినతరం చేయనుంది. ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, రీయూజ్డ్ కంటెంట్‌ను తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. AI వీడియోలు, కాపీపేస్ట్ కంటెంట్, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తే ఛానళ్లు డీమానిటైజ్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కంటెంట్‌తో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పాటించాలని పేర్కొంది.

News July 9, 2025

టెస్ట్ ర్యాంకింగ్స్: టాప్-10లోకి భారత కెప్టెన్

image

మెన్స్ క్రికెట్ టెస్ట్ ర్యాంకులను ICC ప్రకటించింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నం.1 స్థానంలో నిలవగా మరో బ్యాటర్ రూట్ ఓ స్థానం దిగజారి నం.2లో కొనసాగుతున్నారు. భారత బ్యాటర్ జైస్వాల్ నాలుగో స్థానంలో, కెప్టెన్ గిల్ ఏకంగా 15 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచారు. వికెట్ కీపర్ పంత్ ఒక స్థానం దిగజారి 8వ స్థానంలో ఉన్నారు. అటు టెస్టుల్లో ఆస్ట్రేలియా, వన్డే, టీ20ల్లో టీమ్ ఇండియా తొలి స్థానంలో ఉన్నాయి.