News August 20, 2024
కోనసీమ: వరదల ఎఫెక్ట్.. నష్టమెంతో లేక్క తేలింది

గోదావరి వరదల వల్ల కోనసీమ జిల్లాలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టాన్ని అధికారులు పక్కాగా నిర్ధారించారు. 1926.73 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని లెక్క తేల్చారు. 759.65 హెక్టార్లలో అరటి, 28.92 హెక్టార్లలో తమలపాకు, 0.39 హెక్టార్లలో పూల తోటలు, 0.74 హెక్టార్లలో బొప్పాయి, 1063 హెక్టార్లలో కూరగాయల తోటలకు నష్టం వాటిలినట్లు పేర్కొన్నారు. 6,183 మంది రైతులకు రూ.4.05 కోట్ల పరిహారం అందించేందుకు నివేదిక పంపారు.
Similar News
News November 7, 2025
రిజర్వ్ ఫారెస్ట్‌లో నగర వనం: డీఎఫ్‌వో

జాతీయ రహదారిని ఆనుకుని దివాన్ చెరువులోని రిజర్వ్ ఫారెస్ట్ లో 125 ఎకరాల విస్తీర్ణంలో రూ.రెండు కోట్లు వ్యయంతో నగరవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ గౌరీ శంకర్‌తో కలిసి ఫారెస్ట్ డీఎఫ్ఓ ప్రభాకరరావు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే పుష్కరాలు నాటికి ఇది సిద్ధమవుతుందని డీఎఫ్ఓ తెలిపారు.
News November 7, 2025
నిడదవోలు: పీఎంజేవైలో 757 ఇల్లు మంజూరు

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత వాసులకు 757 గృహాలు మంజూరైనట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి ఎం. బుజ్జి తెలిపారు. ఆమె గురువారం నిడదవోలు మండలంలో క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పీఎంఏవై పథకం కొత్త మార్గదర్శకాలు విడుదలైనట్లు ఆమె పేర్కొన్నారు. నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీలతో పాటు రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ గృహాలు అందుతాయని వెల్లడించారు.
News November 6, 2025
ఉండ్రాజవరం: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో దువ్వాపు జయరాం (25) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


