News August 20, 2024

PLEASE CHECK: రిజల్ట్స్ వచ్చేశాయ్

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) 1,765 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పేపర్-1 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. సివిల్, ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాల్లో కలిపి మొత్తం 16,223 మంది అభ్యర్థులు పేపర్-2 రాసేందుకు అర్హత సాధించినట్లు SSC తెలిపింది. అభ్యర్థులు <>ssc.gov.in<<>> వెబ్‌సైట్‌లో ఫలితాలు తెలుసుకోవచ్చు. జేఈ పోస్టుల భర్తీకి జూన్ 5, 6, 7 తేదీల్లో పేపర్-1 ఎగ్జామ్ జరిగింది.

Similar News

News July 9, 2025

గుర్తుపట్టలేని లుక్‌లో స్టార్ హీరో

image

కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటిస్తున్న కొత్త మూవీ ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. తాజాగా ఈ సినిమాలో శివరాజ్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చేతిలో గన్ పట్టుకుని సీరియస్‌గా చూస్తున్న ఫొటోలో ఆయన గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వైశాక్ నిర్మిస్తున్నారు.

News July 9, 2025

బాబు గాడిదలు కాస్తున్నారా?: జగన్

image

AP: కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు కన్నీరు పెడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ‘కేజీ మామిడి రెండు రూపాయలా? ఇదేం దారుణం. మా ప్రభుత్వ హయాంలో రూ.22-29కి కొన్నాం. కర్ణాటకలో రూ.16 ఇచ్చి కేంద్రమే కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో బాబు గాడిదలు కాస్తున్నారా? మామిడికి కనీసం రూ.12 కూడా ఇచ్చే పరిస్థితిలో లేరు’ అని బంగారుపాళ్యం పర్యటనలో ఫైరయ్యారు.

News July 9, 2025

యూట్యూబ్ కొత్త రూల్స్.. ఎప్పటినుంచంటే?

image

యూట్యూబ్ తన మానిటైజేషన్ విధానాన్ని ఈనెల 15వ తేదీ నుంచి కఠినతరం చేయనుంది. ఒరిజినల్ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, రీయూజ్డ్ కంటెంట్‌ను తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. AI వీడియోలు, కాపీపేస్ట్ కంటెంట్, తక్కువ ఒరిజినాలిటీ ఉన్న వీడియోలు పోస్ట్ చేస్తే ఛానళ్లు డీమానిటైజ్ అవుతాయని తెలిపింది. ఒరిజినల్ కంటెంట్‌తో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను పాటించాలని పేర్కొంది.