News August 21, 2024
HYD నుంచి కటక్ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు

HYD నగరం నుంచి కటక్ వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. HYD నుంచి కటక్‌కు ప్రతి మంగళవారం (ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 17 వరకు) ట్రైన్ ఉంటుంది. కటక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రతి బుధవారం (ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 18 వరకు) సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News September 18, 2025
జూబ్లీహిల్స్‌లో ‘కలర్ ఫొటో’కు అవకాశం?

త్వరలో బిహార్‌లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఈవీఎంలలో ఉపయోగించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం త్వరలో జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అమలు చేస్తారో? లేదో? కమిషన్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే కలర్ ఫొటో గురించి ఇప్పటికే అన్ని రాష్ర్టాలకూ ఈసీ లేఖలూ రాసింది. ఇదే జరిగితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాడే EVMలలో అభ్యర్థుల కలర్ ఫొటో చూసి ఓటేయవచ్చన్న మాట.
News September 18, 2025
HYD: నల్లాబిల్లు కట్టాలని క్రెడిట్‌కార్డు ఖాళీ చేశాడు!

సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో డబ్బు కాజేస్తున్నారు. పెండింగ్ నల్లా బిల్లు చెల్లించాలని ఆన్‌లైన్ లింక్ పంపి ఓ వ్యక్తి నుంచి రూ.95,237 కాజేశారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ శ్రీరామ్ నగర్ కాలనీవాసి సంకలమద్ది శ్రీనివాస్ రెడ్డికి SEPT 11న వాటర్ బోర్డుకు బిల్లు చెల్లించాలని 6303323494 నుంచి వాట్సప్ లింక్ పంపాడు. ఈనెల బిల్ చెల్లించలేదని, నిజమేనని నమ్మి APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయగా క్రెడిట్ కార్డు కాళీ అయింది.
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.