News August 21, 2024

నెల్లూరు: ఓపెన్ లేఅవుట్ ఖాళీ స్థలాల పరిశీలన

image

నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ మంగళవారం నగరంలోని పొదలకూరు రోడ్డు, FCI గోదాములు, వేపదొరువు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓపెన్ లే అవుట్ ఖాళీ స్థలాలను పరిశీలించారు. నగర పాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలను ప్రజాప్రయోజనాల నిమిత్తం అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రయివేటు ఖాళీ స్థలాల్లో నిర్వహణ లేకుండా ముళ్ళ కంపలు తొలగించాలని ఆదేశించారు.

Similar News

News January 18, 2026

వాహనదారులకు నెల్లూరు ఎస్పీ సూచనలు

image

నెల్లూరు జిల్లాలో పొగ మంచు ఎక్కువైంది. ఈక్రమంలో వాహనదారులకు ఎస్పీ డా.అజిత వేజెండ్ల పలు సూచనలు చేశారు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగించాలన్నారు. వాహనాల మధ్య దూరం పాటించాలని కోరారు. హజార్డ్ లైట్స్ ఆన్ చేయడంతో పాటు, డి ఫాగర్ ఆన్‌లో ఉంచాలన్నారు. ఈ నియమాలను పాటిస్తూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

News January 18, 2026

నెల్లూరోళ్లు రూ.23.17 కోట్ల మద్యం తాగేశారు..!

image

నెల్లూరు జిల్లాలో సంక్రాంతి ఘనంగా జరిగింది. 3రోజులు ప్రజలు ఆహ్లాదంగా గడిపారు. మందుబాబులు మత్తులో మునిగి తేలారు. ఫలితంగా జిల్లాలోని వైన్ షాపులన్నీ కిటకిటలాడాయి. పల్లె, పట్టణమనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం ఏరులైపారింది. 14 నుంచి 16వ తేదీ రాత్రి వరకు రూ.23.17 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ. 2.06. కోట్ల మేర వ్యాపారం జరిగింది.

News January 18, 2026

నెల్లూరు: ఇద్దరు టీచర్లకు ఐదేళ్ల జైలు శిక్ష

image

ప్రైవేటు పాఠశాలలో క్రమశిక్షణ పేరుతో విద్యార్థిపై దాడి చేసి అతని మృతికి కారణమైన కేసులో ఇద్దరు ఉపాధ్యాయులకు కోర్టు శిక్ష విధించింది. కావలి సీనియర్ సివిల్ జడ్జి గీతావాణి తీర్పు వెలువరించారు. నేరం రుజువవడంతో కె. కౌసల్య, మందా అయ్యన్నలకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమానా విధించారు. ఈ ఘటన అప్పట్లో (2014) తీవ్ర సంచలనం రేపింది.