News August 21, 2024
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఆగస్టు 21, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 4:46 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:00 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
అసర్: సాయంత్రం 4:46 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:38 గంటలకు
ఇష: రాత్రి 7.53 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News January 12, 2026
జంతికలు కరకరలాడుతూ రావాలంటే?

జంతికలు కరకరలాడాలంటే కప్పు బియ్యప్పిండికి రెండు కప్పుల సెనగపిండి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో కలపాలి. పిండిలో వాము, వెన్న వేయాలి. గట్టిగా, మరీ జారుగా కాకుండా కలపాలి. అలాగే ముద్ద కలిపిన తర్వాత తడి వస్త్రంతో పైన కప్పేయాలి. 15 నిమిషాల తర్వాతే ఆ పిండిని వాడాలి. అలాగే వేయించేటప్పుడు జంతికలని ఎక్కువ సేపు నూనెలో ఉంచొద్దు. అలా ఉంచితే జంతికలు గట్టిగా ఉంటాయి. రంగుమారగానే జంతికల్ని బయటకు తీసేయాలి.
News January 12, 2026
శివారాధనలో ‘3’ అంకె విశిష్టత

శివారాధనలో 3 అంకెకు విశిష్ట స్థానం ఉంది. శివుని త్రిశూలం సత్వ, రజో, తమో గుణాలకు చిహ్నం. ఆయనకెంతో ఇష్టమైన బిల్వదళంలోని 3 పత్రాలు త్రిమూర్తులకు ప్రతీకలు. మూడో నేత్రం జ్ఞానం, అంతర్దృష్టిని సూచిస్తుంది. త్రిపుండ్రాలు భౌతిక, ఆధ్యాత్మిక, అతీంద్రియ శక్తులకు సంకేతాలు. శివలింగాన్ని దర్శిస్తే ముల్లోకాలు దర్శించినట్లే! శివానుగ్రహం కోసం మారేడు దళాల నోము ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 12, 2026
డ్రైవర్ లెస్ మెట్రో ట్రయల్ రన్ విజయవంతం

చెన్నైలో డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ ట్రయల్ రన్ విజయవంతమైంది. వడపళణి నుంచి పోరూర్ వరకు నిర్వహించిన తొలి ట్రయల్ సక్సెస్ అయిందని అధికారులు ప్రకటించారు. పూందమల్లి-వడపళణి రూట్లో డబుల్ డెక్కర్ వంతెన నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో పూందమల్లి-పోరూర్ వరకు 9 కి.మీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ట్రాక్, సిగ్నలింగ్ పనులు ముగియడంతో త్వరలో పూర్తి స్థాయిలో డ్రైవర్ లెస్ మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి.


