News August 21, 2024
మూడో ర్యాంకుకు చేరుకున్న మంధాన
మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఒక ప్లేస్ ఎగబాకి 3వ స్థానానికి చేరుకున్నారు. టీ20 ర్యాంకుల్లో 4వస్థానంలో ఉన్నారు. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ వన్డేల్లో 9వ స్థానంలో ఉన్నారు. వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో భారత్ నుంచి దీప్తి శర్మ(3) మాత్రమే టాప్ 10లో ఉన్నారు. టీ20 బౌలింగ్ విషయంలోనూ దీప్తి 3వ స్థానంలో ఉండగా రేణుకా సింగ్ 5వ ర్యాంకులో ఉన్నారు.
Similar News
News January 23, 2025
భిక్షమేసిన వ్యక్తిపై కేసు నమోదు
MP ఇండోర్‌లో ఓ గుడి ముందు యాచకురాలికి భిక్షమేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం రుజువైతే కోర్టు అతడికి జైలు శిక్ష కానీ రూ.5 వేల ఫైన్ కానీ విధించనుంది. ఇండోర్‌ను బెగ్గింగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా భిక్షాటనను నగరంలో బ్యాన్ చేశారు. కొందరు యాచకులకు ఇళ్లు ఉన్నా, తమ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా భిక్షమెత్తుకుంటున్నట్లు పోలీసులు గుర్తించడం విశేషం.
News January 23, 2025
‘గాంధీ తాత చెట్టు’ మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు
దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతివేణి నటించిన ‘గాంధీ తాత చెట్టు’పై సూపర్ స్టార్ మహేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా మీతో పాటు ఉండిపోతుందని చెప్పారు. అహింస గురించి పదునైన కథను దర్శకురాలు పద్మ మల్లాది అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. చిన్నారి నేస్తం సుకృతి శక్తిమంతమైన ప్రదర్శనతో తనను గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ఈ కళాఖండాన్ని చూసి తీరాలని Xలో రాసుకొచ్చారు.
News January 23, 2025
బీసీ రిజర్వేషన్లు పెంచాలని సీఎంకు కవిత లేఖ
TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బీసీలకు రిజర్వేషన్లు 42% పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని MLC కవిత విమర్శించారు. కులగణన వివరాలను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదని సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కుంటి సాకులతో తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ను సహించబోదని హెచ్చరించారు. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని కోరారు.