News August 21, 2024

రైల్వేకోడూరుకు పవన్ కళ్యాణ్.. షెడ్యూల్ ఇదే

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23న రైల్వేకోడూరు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గన్నవరం నుంచి ఆయన ఉదయం 9:05 గంటలకు రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 9:10 గంటలకు మైసూర్ వారి పల్లి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మైసూరు వారి పల్లె సభలో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా రాజంపేట మండలం పులపుత్తూరుకు మధ్యాహ్నం 12:45 గంటలకు చేరుకుని వరదల్లో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తారు.

Similar News

News January 18, 2025

Rewind: చౌటిపల్లెలో బస చేసిన సీనియర్ ఎన్టీఆర్

image

నందమూరి తారక రామారావు కొండాపురం మండలంలోని చౌటిపల్లెలో గతంలో బస చేశారు. 1982 ఏడాది చివరిలో తాడిపత్రి నుంచి చైతన్య రథంలో డ్రైవర్‌గా హరికృష్ణతో రామారావు రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోలో భాగంగా చౌటిపల్లె వద్ద గల చిత్రావతి నదిపై వాహనం మొరాయించడంతో అక్కడే అగి బస చేశారు. 1993 ఎన్నికల ప్రచారంలో కూడా పాత కొండాపురంలో టీ తాగారు. నేడు NTR 29వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను పలువరురు Rewind చేసుకున్నారు.

News January 18, 2025

YSR జిల్లాపై చంద్రబాబు అసంతృప్తి

image

చంద్రబాబు శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్ ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిలో చివరి మూడు స్థానాల్లో YSR జిల్లా, అల్లూరి, తూ.గో జిల్లా ఉండగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీల పనీతీరు, జిల్లాలో పథకాల అమలు, తదితర వాటిలో ర్యాంకులు ఇచ్చారు. సరిగా పనిచేయని పలువురు మంత్రులను CM చంద్రబాబు హెచ్చరించారు.

News January 18, 2025

నేడు కడప జిల్లాకు చంద్రబాబు.. ట్రాఫిక్ ఆంక్షలు.!

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. CM పర్యటన నేపథ్యంలో జిల్లాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మైదుకూరుకు వెళ్లే వాహనాల దారి పూర్తిగా మళ్లించారు. బద్వేలు- పోరుమామిళ్ల వైపు వెళ్లే వాహనాలు ఖాజీపేట, నాగసానిపల్లె మీదుగా వెళ్లాలన్నారు. కడప, ప్రొద్దుటూరు, కర్నులు వైపు వెళ్లే వాహనాలు టౌన్‌లోకి రాకుండా జాతీయ రహదారి పైనుంచి వెళ్లాలని CI సయ్యద్ తెలిపారు.