News August 21, 2024
హాస్టళ్లకు కీలక ఆదేశాలు

AP: అనకాపల్లిలో కలుషిత ఆహారం తిని నలుగురు చిన్నారులు <<13890531>>మృతి చెందిన<<>> ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు అలర్ట్‌గా ఉండాలని మంత్రి సవిత సూచించారు. బయటి ఆహారాన్ని హాస్టళ్లలోకి అనుమతించొద్దని, విద్యార్థులు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. సురక్షిత ఆహారం అందించాలని, ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
Similar News
News September 18, 2025
3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.
News September 18, 2025
శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.
News September 18, 2025
ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<