News August 21, 2024

తూ.గో.: రేపటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

image

శ్రావణమాసంలో ఈ నెల 22, 23 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో 2 రోజులు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో వెయ్యి వరకు వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో రెండు రోజుల్లో 200 వివాహం జరగనున్నాయి. 22వ తేదీ 92, 23న 87 వివాహాలకు ఇప్పటికే మండపాలు బుక్ చేసుకున్నారు. ఇవి కాక మరో 50 వరకు వివాహాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. దీంతో పెళ్లిళ్ల కోలాహలం మొదలైంది.

Similar News

News January 13, 2026

NMMS విద్యార్థులకు అలెర్ట్.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

image

డిసెంబర్ 7న NMMS పరీక్ష రాసిన విద్యార్థులు కుల, ఆదాయ, 7వ తరగతి ధృవీకరణ పత్రాలను ఈ నెల 20లోపు సిద్ధం చేసుకోవాలని DEO వాసుదేవరావు మంగళవారం సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. తల్లిదండ్రులు గడువులోగా ఈ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే స్కాలర్‌షిప్ పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

News January 13, 2026

RJY: మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీ

image

వరకట్న నిషేధ చట్టం-1961 అమలుపై అవగాహన పెంచాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ సూచించారు. మంగళవారం రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఈ చట్టం అమలు, మహిళలపై వేధింపుల నివారణకు ప్రత్యేక బోర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. వరకట్న దురాచారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. మహిళల రక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News January 13, 2026

కడియం నర్సరీలలో మొక్కలతో సంక్రాంతి శోభ

image

కడియం పల్ల వెంకన్న నర్సరీలో మంగళవారం సంక్రాంతి సందడి నెలకొంది. పండుగను పురస్కరించుకుని మొక్కలతో రూపొందించిన ప్రత్యేక ఆకృతులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. భోగి మంట, పాలకుండ, గాలిపటం, ఎద్దు, కోడిపుంజు వంటి పండుగ ప్రతీకలను సృజనాత్మకంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి శోభను ప్రతిబింబిస్తున్న ఈ మొక్కల కళాఖండాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.