News August 21, 2024

NZB: ‘అమలు కాని ప్లాస్టిక్ నిషేధం’

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పట్టణాలు ప్లాస్టిక్‌ మయమయ్యాయి. ఇదే పరిస్థితి పల్లెల్లోనూ.. నెలకొంది. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం జరుగుతోంది. పట్టణాలలో రోజూ ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో నాలుగో వంతు ప్లాస్టిక్‌ ఉంటోంది. ప్లాస్టిక్‌ వినియోగంపై మునిసిపాలీటీలో పంచాయతీల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. దీంతో వ్యాపారులు యథేచ్ఛగా నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తూనే విక్రయాలు జరుపుతున్నారు.

Similar News

News November 11, 2025

ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో నిజామాబాద్

image

వానాకాలం-2025 సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వెల్లడించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి ధాన్యం సేకరణ, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు.

News November 11, 2025

NZB: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

జాతీయస్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లాకు చెందిన 10 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 10 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ఈ నెల 21 నుంచి 23 వరకు పంజాబ్‌లో జరిగే జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు.

News November 11, 2025

NZB: ఢిల్లీలో పేలుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎంపీ

image

ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎంపీ అర్వింద్ ట్వీట్ చేశారు.