News August 21, 2024
స్కూళ్లు బంద్ అంటూ మెసేజులు
భారత్ బంద్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవు అంటూ తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పుడు మెసేజులు పంపుతున్నాయి. దీంతో స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైన వారితో పాటు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేస్తున్నారు. టీచర్లు మాత్రం పాఠశాలకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. అటు బీఎస్పీ సహా వివిధ దళిత సంఘాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు డిపోల వద్ద ఆందోళన చేయడంతో బస్సులు నిలిచిపోయాయి.
Similar News
News February 12, 2025
కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన
TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.
News February 12, 2025
ముస్లిం ప్రభుత్వోద్యోగులకు ఏపీ GOVT గుడ్ న్యూస్
AP: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లింలకు రాష్ట్ర సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో విధుల నుంచి వారు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతినిచ్చింది. వచ్చే నెల 2 నుంచి 30 వరకు ముస్లిం ఉద్యోగులు ఓ గంట ముందే విధుల నుంచి వెళ్లొచ్చని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల ఉద్యోగులకూ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. అదే విధంగా ముస్లింలందరికీ రంజాన్ తోఫాను అందించాలని CM నిర్ణయించారు.
News February 12, 2025
హీరో విజయ్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు?
తమిళ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం(TVK) పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో భేటీ కావడం తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పీకేను తమ సలహాదారుగా విజయ్ నియమించుకోవాలని భావిస్తున్నారంటూ ప్రచారం నడుస్తోంది. వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.