News August 21, 2024
బీటెక్ విద్యార్థులకు నేటి నుంచి స్లైడింగ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1724204678805-normal-WIFI.webp)
TG: కన్వీనర్ కోటాలో బీటెక్ సీట్లు పొంది కాలేజీల్లో చేరిన విద్యార్థులు తమ శాఖను మార్చుకునేందుకు నేటి నుంచి స్లైడింగ్ విండో ఓపెన్ అయింది. బ్రాంచి మారినప్పటికీ బోధనా రుసుము అందుతుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి ఖాళీ సీట్ల తుది జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నాయి. మధ్యాహ్నం రెండింటి నుంచి రేపటి వరకు ఆప్షన్ల నమోదు, ఈ నెల 24న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపాయి.
Similar News
News February 12, 2025
కొత్త 50 రూపాయల నోట్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739372887723_653-normal-WIFI.webp)
ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త రూ.50 నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
News February 12, 2025
కొత్త రేషన్ కార్డులు.. ప్రభుత్వం కీలక సూచన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737176982003_367-normal-WIFI.webp)
TG: రేషన్ కార్డు దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ కీలక సూచనలు చేసింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని, వారి వద్దే భద్రపరుచుకోవాలని చెప్పింది. అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని, నిర్దిష్ట గడువు ఏమి లేదని పేర్కొంది. కాగా కొన్ని చోట్ల రేషన్ కార్డు దరఖాస్తులకు భారీగా వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే.
News February 12, 2025
ముస్లిం ప్రభుత్వోద్యోగులకు ఏపీ GOVT గుడ్ న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739373829071_1045-normal-WIFI.webp)
AP: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లింలకు రాష్ట్ర సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. రంజాన్ మాసంలో విధుల నుంచి వారు గంట ముందుగానే వెళ్లేందుకు అనుమతినిచ్చింది. వచ్చే నెల 2 నుంచి 30 వరకు ముస్లిం ఉద్యోగులు ఓ గంట ముందే విధుల నుంచి వెళ్లొచ్చని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల ఉద్యోగులకూ ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. అదే విధంగా ముస్లింలందరికీ రంజాన్ తోఫాను అందించాలని CM నిర్ణయించారు.