News August 21, 2024
వివేకా హత్య కేసు: ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్

వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడు సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని, బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. అయినా న్యాయస్థానం తాజాగా బెయిల్ ఇచ్చింది. కాగా, ఇదే కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
Similar News
News September 16, 2025
యూసుఫ్ పఠాన్‌ను ఆక్రమణదారుడిగా పేర్కొన్న హైకోర్టు

ఆక్రమించిన ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని మాజీ క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్‌ను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. అతడిని ఆక్రమణదారుడిగా పేర్కొంది. సెలబ్రిటీలు చట్టానికి అతీతులు కారని చెప్పింది. వడోదరలో ఇంటి పక్కనున్న ఖాళీ స్థలాన్ని యూసుఫ్ ఆక్రమించగా 2012లో సర్కార్ నోటీసులిచ్చింది. తాను, తన సోదరుడు క్రికెటర్లమని, సెక్యూరిటీ దృష్ట్యా ఆ భూమిని కొనేందుకు అనుమతించాలని కోరగా హైకోర్టు తాజాగా తిరస్కరించింది.
News September 16, 2025
మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

మాడ్యులర్ కిచెన్‌కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే కిచెన్‌కి వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరకులు పెట్టుకోవడానికి అల్మారా, డీప్ డ్రా నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్‌లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనేలా ఉండాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.
News September 16, 2025
పాక్‌కు అవమానం.. మాట ప్రకారం తప్పుకుంటుందా?

IND vs PAK మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని PCB చేసిన <<17717948>>ఫిర్యాదును<<>> రిజెక్ట్ చేసినట్లు ICC అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామన్న పాక్‌కు ఘోర అవమానం ఎదురైంది. మొన్న గ్రౌండ్లో ప్లేయర్లకు, ఇప్పుడు ఆ దేశ బోర్డుకు భంగపాటు తప్పలేదు. మాట మీద నిలబడి టోర్నీ నుంచి తప్పుకుంటే పాక్‌కు కనీస మర్యాదైనా దక్కుతుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.