News August 21, 2024
ఈనెల 23న హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ‘అనంతశేష స్థాపన’

నగరం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. నార్సింగిలో హరే కృష్ణ మూమెంట్ సంస్థ ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పేరుతో భారీ ఆలయాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న అనంతశేష స్థాపన ద్వారా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. హరేకృష్ణ మూమెంట్ ఛైర్మన్, అక్షయపాత్ర ఫౌండేషన్ ఛైర్మన్ మధు పండిట్ దాస్ ప్రభూజీ తదితరులు హాజరుకానున్నారు.
Similar News
News November 3, 2025
సికింద్రాబాద్: ఉజ్జయిని మహకాంళిని దర్శించుకున్న కలెక్టర్

కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని డీసీపీ రష్మిక పెరుమాళ్, జిల్లా కలెక్టర్ హరిచందన దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు కలెక్టర్‌కి ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అద్దాల మండపం వద్ద దీపాలంకరణ కార్యక్రమంలో మహిళా భక్తులతో కలిసి దీపాలను వెలిగించారు.
News November 3, 2025
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ప్రకటన

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ కోదండరాం తెలిపారు. షేక్‌పేట్ పరిధి ఓయూ కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రులు వివేక్, అజహరుద్దీన్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ జన సమితి మద్దతు కోరారని, ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
News November 3, 2025
గ్రేటర్ హైదరాబాద్ PDSU నూతన కమిటీ ఎన్నిక

PDSU గ్రేటర్ హైదరాబాద్ జిల్లా నూతన కమిటీని ఈరోజు ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా రాకేశ్, ప్రధాన కార్యదర్శిగా హరీశ్, ఉపాధ్యక్షులుగా నాగరాజు, నవీన్, రత్నాశేఖర్, సహాయ కార్యదర్శులుగా, సాయిప్రసాద్, దీక్షిత, శివ, సోషల్ మీడియా కన్వీనర్లుగా అనిల్, అభిరామ్, 24 మంది సిటీ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.


